రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం వివిధ అడ్వాన్స్ లు మరియు అప్పులు మంజూరు చేస్తుంది. వాటిలో గృహ నిర్మాణ, స్థలం కొనుగోలు అడ్వాన్స్, మోటర్ కార్ అడ్వాన్స్, కంప్యూటర్ అడ్వాన్స్, వివాహ అడ్వాన్స్, మొదలగునవి కలవు. వాటి మంజూరు విధి విధానాలు పరిశీలిద్దాం.
-"యు టి ఎఫ్ ఐక్యఉపాధ్యాయ నుండి సేకరించ బడినది".
www.apteachers.in వారిచే తెలుగు లో మీ కోసం అందించబడుతుంది"
గృహ నిర్మాణ అడ్వాన్స్:
ఈ అడ్వాన్స్ ఇంటి స్థలం/ గృహ నిర్మాణం / గృహం కొనుగోలు / ఇంటి స్థలం కొని ఇల్లు నిర్మించుకోవడానికి / గృహ మరమ్మత్తులు నిమిత్తం మంజూరు చెయ్యబడుతుంది
అర్హత :
8 సం. ల సర్వీసు కలిగిన రెగ్యులర్ ఉద్యోగులు అర్హులు. భార్య భర్తలు ఇరువురు ఉద్యోగులు ఐతే ఒకరు మాత్రామే అర్హులు. గతం లో ఇంటి స్థలం కొనుగోలు / గృహ నిర్మాణం నకు ఋణం పొందని వారు, ఉద్యోగి పేరు మీద / భార్య / మైనరు పిల్లల పేరు మీద ఇల్లు లేని వారు అర్హులు.
అడ్వాన్సు గా మంజూరు అయ్యే మొత్తం:
గృహ నిర్మాణం / గృహం కొనుగోలు నిమిత్తం మూల వేతనానికి 72 రెట్లు లేదా 2010 వేతన స్కేళ్ళ ప్రకారం
వడ్డీ రేటు :
RPS 2010 నందు వడ్డీ రేటు ను సంవత్సరానికి 4వ తరగతికి 5 % , ఇతరులకు 5 .5 % గ నిర్ణయించారు.
అడ్వాన్సు పంపిణి:
మంజూరు అధికారం:
ఈ అడ్వాన్సు మంజూరు అధికారం కార్యాలయ అధికారికి జి వో 131 ఆర్ధిక, తేది 19.08.1997 ద్వారా దఖలు పరచబడినది. దరఖాస్తు అందిన వెంటనే కార్యలయాధిపతి, వివరాలను శాఖాదిపతి కి తెలిపి బడ్జెట్ విడుదల ఐన తదుపరి చెల్లిస్తారు. ఉపాధ్యాయుల విషయంలో డి.ఇ.వో మంజూరు అధికారిగ ఉంటారు.
దరఖాస్తు చేసే విధానం:

- మూల వేతనం రూ. 13660 /- ల వరకు గరిష్టం గా 5 లక్షలు,
- మూల వేతనం రూ. 21820 /- ల వరకు గరిష్టం గా 7 లక్షలు,
- ఆ పై మూల వేతనం 10 లక్షలు మంజూరు చెయ్యబడుతుంది.
- అసలు 240 , వడ్డీ 60 నెలసరి వాయిదా లలో చెల్లించాలి
వడ్డీ రేటు :
RPS 2010 నందు వడ్డీ రేటు ను సంవత్సరానికి 4వ తరగతికి 5 % , ఇతరులకు 5 .5 % గ నిర్ణయించారు.
అడ్వాన్సు పంపిణి:
- స్థలం కొనుగులు కొరకు మంజూరు అయ్యే అడ్వాన్సు లో 25 % స్థలం కొనుగులు అగ్రీమెంట్ పూర్తి అయిన తరువాత చెల్లిస్తారు. మిగిలిన మొత్తం స్థలం రిజిస్టర్ సమయంలో స్థలం అమ్మకం దారుకు చెక్కు ద్వారా చెల్లిస్తారు.
- స్థలం తో సహా గృహ నిర్మాణం కోసం కూడా అడ్వాన్సు మంజూరు అయ్యే సందర్భంలో పైన తెలిపిన విధంగా మంజూరు ఐన 25 % అడ్వాన్సు డ్రా చేసిన రెండు నెలలలోపు స్థలం కొన్న ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. స్థలం ప్రభుత్వానికి తనఖా చేసిన అనంతరం అడ్వాన్సు లో 50 % చెల్లిస్తారు. మిగిలిన 25 % అడ్వాన్సు కప్పు వరకు నిర్మాణం జరిగిన అనంతరం చెల్లిస్తారు.
- స్థలం కాకుండా కేవలం గృహ నిర్మాణం కోసం మాత్రమె అయితే స్థలం ప్రబుత్వం పేర తనఖా చేసిన అనంతరం అడ్వాన్సు లో 1/3 వంతు, గోడలు నిర్మాణం పూర్తైన తరువాత రెండవ విడతగా 1/3 వంతు, నిర్మాణం కప్పు వరకు చేరితే మిగిలిన 1/3 వంతు చెల్లిస్తారు.
- మరమ్మత్తులు, అదనపు నిర్మాణాల సందర్భం లో ప్లాన్, అంచనా విలువ, ప్రభుత్వం పేరన మర్టిగేజ్ పూర్తైన వెంటనే ఏక మొత్తం గా అడ్వాన్సు చెల్లిస్తారు
మంజూరు అధికారం:
ఈ అడ్వాన్సు మంజూరు అధికారం కార్యాలయ అధికారికి జి వో 131 ఆర్ధిక, తేది 19.08.1997 ద్వారా దఖలు పరచబడినది. దరఖాస్తు అందిన వెంటనే కార్యలయాధిపతి, వివరాలను శాఖాదిపతి కి తెలిపి బడ్జెట్ విడుదల ఐన తదుపరి చెల్లిస్తారు. ఉపాధ్యాయుల విషయంలో డి.ఇ.వో మంజూరు అధికారిగ ఉంటారు.
దరఖాస్తు చేసే విధానం:
- ఈ అడ్వాన్సు పొంది గృహ నిర్మాణం / కొనుగోలు చేసిన వారు ప్రభుత్వ వసతి నివాసాలకు అర్హులు కారు
- గృహాన్ని కొనుగోలు చేసిన సందర్భం లో అడ్వాన్సు అమ్మకందారునికి చెక్కు / డ్రాఫ్ట్ ద్వారా చెల్లించబడుతుంది.
- రిజిస్ట్రేషన్ తదితర రుసుములకు అడ్వాన్సు నుండి చెల్లించవచ్చును.
- సర్వీసు మొత్తం మీద ఒక పర్యాయం మాత్రమె అడ్వాన్సు చెల్లించబడుతుంది. ఐతే మరమ్మత్తులు / అదనపు నిర్మాణాల కొరకు మొదట మంజూరు ఐన మొత్తం పూర్తిగా చెల్లించిన తరువాత రెండవ పర్యాయం మంజూరు చేస్తారు.
- హుడా / హౌసింగ్ బోర్డుచే గృహ మంజూరు కాబడిన వారికి ఈ అడ్వాన్సు మంజూరు చెయ్యబడదు. అయితే మరమ్మత్తులు నిమిత్తం ఋణం మంజూరు చెయ్యబడుతుంది.
- దరఖాస్తు దారునితో సమాన వేతనం గల ఉద్యోగి హామిదారుగా ఉండాలి
- అడ్వాన్సు తొలత వివరాలు సేవా పుస్తకంలో నమోదు చెయ్యాలి
- నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్సు ఖర్చు చేసినా, దుర్వినియోగం చేసిన అపరాధ వడ్డీనే కాకుండా సి.సి.ఏ నిబంధన ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోబడుతాయి